మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సినీ హీరో నితిన్
1 min read
ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికిన ఈవో ఆర్.వి. చందన
ఏలూరు జిల్లాప్రతినిధి న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని ప్రముఖ సినీ హీరో నితిన్, మైత్రి మూవీస్ అధినేత రవిశంకర్, దర్శకుడు వెంకి కుడుముల విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం ఆలయ ముఖ మండపం వద్ద వేద ఆశీర్వచనం గావించినారు ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ శ్రీ స్వామి వారి శేషవస్త్రములతో సత్కరించి, ప్రసాదములు అందజేశారు. అని ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.