NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘కరోన’తో సినీ పరిశ్రమ నష్టపోయింది : టీజీ భరత్​

1 min read

– హీరో గోపిచంద్ సీటీమార్ మూవీ విజ‌యోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న టి.జి భ‌ర‌త్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రముఖ నటుడు గోపీచంద్ హీరోగా న‌టించిన సీటీమార్ చలన చిత్రం విజయోత్సవ వేడుకలు నగరంలోని వెంకటేష్ సినీ కాంప్లెక్స్ లో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిజివి గ్రూప్ సంస్థల సి.ఎం.డి టీజీ భరత్ పాల్గొని విజయోత్సవ కేక్‌ను క‌ట్ చేశారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ కరోనా రెండవ దశ తర్వాత విడుదలైన మొట్టమొదటి కమర్షియల్ చిత్రం గోపీచంద్ నటించిన సీటీ మార్ తొలిరోజే సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడం అభినందనీయమని చెప్పారు. హీరో గోపీచంద్ నటించిన చిత్రాల్లో దాదాపు 80 శాతానికి పైగా విజయవంతమైన చిత్రాలు ఉన్నాయని ఆయన వివరించారు. కరోనా వచ్చిన తర్వాత తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో తెలుగు సినీ పరిశ్రమతో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా ఉందని వివరించారు. ఎలాంటి కరోనా వేవ్ లు రాకుండా ఉంటే ఈ రంగాలు కోలుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రజలు కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సినిమా థియేటర్ కు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించడం, శానిటైజర్ ని వినియోగించడం మరువరాదన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ థియేటర్ సురేష్, గోపీచంద్ అభిమానుల సంఘం నాయకులు గణేష్, ప్రేమ్ ,మహేంద్ర ,ప్రవీణ్, దినకర్, సునీల్, కిట్టు తదితరులు పాల్గొన్నారు. ల్ చిత్రం సిటీ మార్ విజయవంతం కావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. వినాయక చవితి నాడు విడుదలైన ఈ చిత్రం విజయవంతం కావడం సంతోషకరమని అన్నారు. తమ హీరో చిత్రం విజయోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా టిజివి గ్రూప్ సంస్థల సీ. ఎం.డీ. టీజీ భరత్ పాల్గొనడం మరింత ఆనందాన్ని కలిగిస్తుందని ఫ్యాన్స్ అన్నారు.

About Author