ఫిలీం ఇండస్ర్టీ.. రాయలసీమలో ఏర్పాటు చేయాలి
1 min read– 9, 10న MAA అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన
AP యువజన విద్యార్థి సంఘాల జేఏసీ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్ లో MAA కార్యాలయం ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఫిలిం సిటీ ని ఫిలిం స్టూడియో లను మరియు ఫిలిం ఇండస్ట్రీ ని రాయలసీమకు తరలించాలని డిమాండ్ చేశారు ఆంధ్ర ప్రదేశ్ యువజన విద్యార్థి సంఘాల జేఏసీ కో కన్వీనర్ రవి. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10న జేఏసీ చైర్మన్ డి వి కృష్ణ యాదవ్ నేతృత్వంలో హైదరబాద్లోని ‘మా’ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు రవి తెలియజేశారు. టాలీవుడ్ తెలుగు రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి కేవలం హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధికి మాత్రమే కృషి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సినిమా థియేటర్లు మరియు జనాభా ఎక్కువ ఉందని ఆంధ్రప్రదేశ్ నుంచే టాలీవుడ్ కు అధిక ఆదాయం వస్తుందన్నారు. అదేవిధంగా హీరోలు హీరోయిన్లు ఆర్టిస్టులు ఆంధ్ర ప్రదేశ్ రాయలసీమ జిల్లాల వారే ఎక్కువ ఉన్నారని సొంత ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా హైదరాబాద్ ని అభివృద్ధి చేయడం హీరోలు, నిర్మాతలు, దర్శకులు పెట్టుబడులన్నీ హైదరాబాద్ లో పెట్టి సొంత ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర ప్రాంతం లోని రాయలసీమలోని కథలు యాస భాష, ఫ్యాక్షన్ పేరుతో సినిమాలు తీసి వేల కోట్లు సంపాదిస్తూ పుట్టిన గడ్డకు చాలా దారుణంగా అన్యాయం చేస్తున్నారని, సినీ ఇండస్ట్రీలోని పెద్దలందరూ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకి చెందినవారే ఆంధ్రప్రదేశ్ కు సినీ ఇండస్ట్రీ వచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గణేష్ సింగ్ దిలీప్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.