PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ వారం థియేట‌ర్ లో విడుద‌ల‌య్యే చిత్రాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన లాక్ డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు మూత‌పడ్డాయి. దీంతో సినీ అభిమానులు ఓటీటీల్లో సినిమాలు చూశారు. క‌రోన లాక్ డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లింపు.. కేసులు న‌మోదు త‌గ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెర‌వ‌డానికి అనుమ‌తులు ల‌భించాయి. దీంతో చిత్ర నిర్మాత‌లు థియేట‌ర్లలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి మొగ్గుచూపుతున్నారు.
విడుద‌ల‌య్యే చిత్రాలు :

  1. ఎస్.ఆర్. క‌ళ్యాణ‌మండ‌పం.
    కిర‌ణ్ అబ్బవ‌రం, ప్రియాంక జువాల్కర్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం.. ఎస్.ఆర్. క‌ళ్యాణ‌మండ‌పం. సాయికుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. శ్రీధ‌ర్ గాదె ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఆగ‌స్టు 6న ఈ సినిమా థియేట‌ర్లలో విడుద‌ల కానుంది.
  2. ముగ్గురు మొన‌గాళ్లు
    శ్రీనివాస్ రెడ్డి , దీక్షిత్ శెట్టి, వెన్న‌ల రామారావు ప్రధాన‌పాత్రల్లో నిర్మిత‌మైన చిత్రం.. ముగ్గురు మొన‌గాళ్లు. అభిలాష్ రెడ్డి ద‌ర్శక‌త్వంవ‌హించారు. క‌ళ్లు క‌నిపించ‌ని, చెవులు వినిపించ‌ని , మాట్లాడ‌లేని ముగ్గురు యువ‌కుల క‌థ ఇది. ఆగస్టు 6న ఈ సినిమా కూడ విడుద‌ల కానుంది.
  3. ఇప్పుడు కాక ఇంకెప్పుడు
    హ‌స్వంత్ వంగ‌, న‌మ్రత ద‌రేక‌ర్, క‌ళ్యాణ గౌడ కీల‌క పాత్రల్లో న‌టించిన చిత్రం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు. వై యుగంధ‌ర్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. త‌నికెళ్ల భ‌రణి, రాజార‌వీంద్ర, ఐడ్రీమ్ అంజ‌లి కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైనర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 6న విడుద‌ల కానుంది.
  4. దినేష్ తేజ‌, శ్వేత అవ‌స్తి జంట‌గా న‌టిస్తున్న చిత్రం .. మెరిసే మెరిసే. ప‌వ‌న్ కుమార్ .కె ద‌ర్శకుడు. ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం కూడ ఆగ‌స్టు 6న సండ‌ది చేయ‌బోతోంది.

About Author