ఆనందయ్య మందు పై తుది నిర్ణయం..
1 min read
పల్లెవెలుగు వెబ్: ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందు మీద సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. మందు వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఆనందయ్య మందు మీద సీఎం చర్చించినట్టు తెలిపారు. ఆనందయ్య ఔషధం మీద ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం ఆనందయ్య ఔషధం మీద హైకోర్టులో విచారణ జరగనుంది. ఔషధ పరీక్షల పై చివరి నివేదిక వస్తుందని, నివేదికను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలించనుందని ఆయన తెలిపారు.