పూటకో మాట.. పవన్ నైజం: ఎమ్మెల్యే నాని
1 min readపల్లెవెలుగు,చాగలమర్రి: పూటకో మాట మాట్లాడటం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నైజమని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చాగలమర్రిలో మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి ఇబ్రహీం ఇంట్లో జరిగిన ఒక శుభ కార్యక్రమానికి వారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కు రాజకీయ అనుభవం లేకపోవడంతో ఒకచోట ఒక్కొక్క విధముగా మాట్లాడుతున్నారని వారు ధ్వజం ఎత్తారు. ఆయన మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అన్ని స్థానాలకు పోటీ చేసే సత్తా లేని పవన్ వైయస్ జగన్ ను ఎలా ఓడిస్తారని ప్రశ్నించారు.పొత్తుల కోసం ప్రాకులాడకుండా దమ్ము ధైర్యం ఉంటే 175 అసెంబ్లీ స్థానాలకు పవన్ పార్టీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. కులాలను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిబద్ధతతో అంకితభావంతో ప్రజాసేవ చేస్తున్నారని తమకు ప్రజల ఆశీస్సులు ప్రజాబలం ఉన్నంతవరకు పవన్, చంద్రబాబు లు ఏకమైనను వైసీపీ ని ఓడించలేరని వారు ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో కొత్తదనం ఏముందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు అన్నారు.గతంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారని వారు ప్రశ్నించారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరన్నారు. మతిస్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నాడని వారు విమర్శించారు. . అలాగే రాష్ట్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నాయన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ చక్కని పాలన అందిస్తున్నారని వారు కొని ఆడారు. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు తెలుగు భాష సరిగా మాట్లాడలేని నారా లోకేష్ తన పాదయాత్రలో ముఖ్యమంత్రి ప్రభుత్వం పై విమర్శలు చేయడం తగదన్నారు మండలంలోని నేలంపాడు మీదుగా గొట్లూరు వరకు కొత్త రోడ్డు నిర్మాణ పనులు పూర్తికావస్తున్నా యన్నారు పెద్దబోధనం నుండి తోడేళ్లపల్లె వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 3 కోట్ల 56 లక్షల రూపాయలు మంజూరు చేసిందని వారు వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ షేక్ సోహైల్ మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి గారి ఇబ్రహీం, గొడుగునూరు ఎంపిటిసి పత్తి నారాయణ సేవ దళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, వైసీపీ నాయకులు భారత్ గ్యాస్ రఫీ గేట్ల మహబూబ్, ముల్లా ఖాదర్బాషా చక్రం ముల్లా షబ్బీర్ , వెంకటరమణ,షేక్ షబ్బీర్, దాదా బీడీ ఖాజా, ముల్లా బురాన్ ద్దీన్ ,కొండయ్య, అబ్దుల్లా, షేక్షావలి, దేవేంద్రారెడ్డి,రమేష్, మనోహర్ రెడ్డి పెయింటర్ షరీఫ్, ఖదీర్ శ్రీనివాసులు, జల్సా గౌస్,బబ్లు, మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.