కోవిడ్ కట్టడిపై ఆర్థిక మంత్రి సమీక్ష
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా. ఫక్కీరప్ప నేతృత్వంలో కర్నూలు ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అర్హులైన వ్యాక్సినేషన్ పంపిణీ, బాధితులకు మెరుగైన చికిత్స, అవసరమైనంత ఆక్సినజన్ సరఫరా తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. సమావేశంలో ఏఎస్పీ గౌతమి సాలీ, జేసీ రాం సుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజి తదితరులు పాల్గొన్నారు.