30 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణలో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. వీటికి సంబంధించి శాఖలవారీగా నియామక అనుమతుల జీవోలను జారీ చేసింది. ఏ బోర్డులు ఏయే పోస్టుల ఎంపిక బాధ్యతలు చేపట్టాలో నిర్దేశించింది. ఆయా శాఖల నుంచి ఇండెంట్లు రాగానే టీఎస్ పీఎస్సీ సహా ఆయా బోర్డులు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. గ్రూప్-1 పోస్టులకు దశాబ్దం తర్వాత నోటిఫికేషన్ రాబోతోంది. గ్రూప్-1 కింద 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగతావాటిలో పోలీసు, జైళ్లు, వైద్యారోగ్యం, రవాణా శాఖల పోస్టులున్నాయి. హోంశాఖలో అత్యధికంగా 17,096, వైద్య శాఖలో 12,735 ఖాళీలు భర్తీ కానున్నాయి. రవాణాలో 216, ఆర్థిక శాఖలో 78, పంచాయతీరాజ్‌లో 126, రెవెన్యూ శాఖలో 121, సంక్షేమ శాఖలో 16, మున్సిపల్ శాఖలో 35, కార్మిక శాఖలో 10 ఉద్యోగ ఖాళీలను నింపనున్నారు. కాగా, ఆర్థిక శాఖ అనుమతిచ్చిన ఈ పోస్టులకు ఆయా శాఖల నుంచి ఇండెంట్లు పెట్టాల్సి ఉంటుంది.