జానపద కార్యక్రమాలను ప్రోత్సాహించి ..ఆర్థిక సహాయం అందించాలి
1 min readసాంస్కృతి శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కలిసిన గడినాడ కన్నడ కళా సంఘం నాయకులు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : కర్నూలు జిల్లా హొళగుంద మండల ఆంధ్రప్రదేశ్ లోని హొళగుంద శ్రీ సిద్దేశ్వర గడినాడ కన్నడ కళా సంఘం మరియు కన్నడ యువక సంఘం వారి ఆధ్వర్యంలో గడీనాడ భాగములో నిర్వహించే బయలాట ,సామాజిక నాటకాలకు మరియు జానపద కార్యక్రమాలను ప్రోత్సాహించి తగిన ఆర్థిక సహాయం చేయాలని కర్నాటక రాష్ట్ర కన్నడ మరియు సంస్కృతి శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖా మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సంగప్ప తంగడగిని కోరారు అదే విధంగా ఆంధ్రరాష్ట్రం లోని అన్నీ కన్నడ ఉన్నత పాఠశాలలో ఆ రాష్ట్ర నాయకులతో చర్చించి కన్నడ మాధ్యమం ను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులైన జాంటి వీరేష్,తుంబలం గాదిలింగ, పత్తార అశోక్, మాటసుగుర్ వీరభద్ర, శరణప్ప మరియు శేఖరప్పలు పాల్గొన్నారు.