పర్వతారోహకుడు సురేష్ బాబుకు ప్రోత్సహంగా ఆర్థిక సాయం అందచేత
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: నేపాల్ దేశంలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన 7వ శిఖరం ధౌలగిరి శిఖరం అధిరోహించేందుకు భారతదేశంలోనే అతి చిన్న వయసు పర్వతారోహకుడైన సురేష్ బాబు అనే వ్యక్తికి ప్రోత్సాహంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు..జియోమైసూర్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల కింద ఆర్థిక సాయం అందచేసిందని కలెక్టర్ తెలిపారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో సురేష్ బాబుకు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామ నివాసి అయిన 25 సంవత్సరాల వయస్సు ఉన్న సురేష్ బాబు చిన్న వయసులోనే ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారని, ఇప్పటివరకు ఇతడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 శిఖరాలు అధిరోహించడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే మనకున్న 7 ఖండాలలో 5 ఖండాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి, తక్కువ సమయంలోనే ఎక్కువ పర్వతాలు అధిరోహించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించడం అభినందనీయమన్నారు..అతనిలో ఉన్న ప్రతిభను గురించి ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం అందించిందిన జరిగిందని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, పొల్యూషన్ కిషోర్ రెడ్డి, జియో మైసూర్ కంపెనీ ప్రతినిధి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.