PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ.30 వేల ఆర్థిక సహాయం

1 min read

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందజేత

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేసిన తల్లిదండ్రులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ఏలూరుజిల్లా కలెక్టర్వె ప్రసన్న వెంకటేష్ 4ఏళ్ల ఓ చిన్నారి హృదయ విధారక పరిస్థితి ని నవంబర్ 27   న జరిగిన జగనన్న కు చెబుదాం స్పందన కార్యక్రమం లో చవి చూశారు. ప్రేమించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు నిన్న అన్న చందంగా పెదవేగి మండలం తాళ్లగోకవరం గ్రామానికి చెందిన మాంద్రు చక్రవర్తి పుట్టుకతో అంగవైకల్యంతో  ఉంటున్నాడు. గత ప్రభుత్వాలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్నకు చెబుతావు కార్యక్రమంలో పెట్టుకున్న ఆర్జి ని ఏలూరు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చూసారు. 4 ఏళ్ల తన కుమారుడు లెమన్ స్టోన్ పుట్టుకతో ససెరెబ్రల్ పాల్సి వ్యాధితో బాధ పడుతున్నాడని చెప్పారు.  కడివెడు దుఃఖాన్ని కడుపులోని దాచుకుని ఆ బాలుడి తల్లిదండ్రులు కొడుకు తో పాటు తాము కూడా జీవచ్చవాల్లా బాటుకుతున్నామని కలెక్టర్ కి వివరించారు. తన కుమారుడి కి వైథ్యం చేయించుకోవడానికి సహాయం అందించాలని  తల్లిదండ్రులు కలెక్టర్ ని కన్నీటితో అర్ధించారు. వారి ఆవేదన విన్న జిల్లా కలెక్టర్ పసి హృదయంల కరిగిపోయి  నాలుగేళ్ళ బాబు దీన పరిస్థితి పై చలించిపోయి అక్కడే ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని పిలిచి సెరెబ్రల్ పాల్సి తో బాధపడుతున్న బాలుడికి అవసరమైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అంతే కాదు ఆ బాలుడికి తన వంతు సాయంగా తన సొంత నిధులు 30 వేల రూపాయలు వెచ్చించి విలువైన ఆధునిక సి పి వాకర్.డి బి స్ప్లింట్.యూనివర్సల్ స్ప్లింట్ లాంటి ఆధునిక బాలుడి నడకను ఉపయోగ పడే ఉపకరణాలను బెంగుళూరు  నుండి రప్పించి కలెక్టర్ ఏలూరులో బాలుడి తల్లి దండ్రులకు శనివారం రాత్రి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని జిల్లా వైద్య శాఖ అధికారికి ఆదేశించారు. కలెక్టర్ తన కుమారుడి పట్ల చూపించిన ప్రేమ.అందించిన సహకారం మారువలేనిదని బాలుడి తల్లిదండ్రులు  చేతులు జోడించి  ఆగని కన్నీళ్లను తుడుచుకుంటూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కి జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి కి కృతజ్ఞతలు తెలిపారు. పెదవేగి మండలం తాళ్లగోకవరం కు చెందిననాలుగేళ్ళ చిన్నారి బాబుకు వచ్చిన పెద్ద కష్టం పై జిల్లా కలెక్టర్ అందించిన సహకారం పై పెదవేగి తహసీల్దార్ నల్లమెల్లి నాగరాజు మాట్లాడుతూ మండల సర్వేలో ఈ బాలుడి విషయం తమ దృష్టికి రావడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని. కలెక్టర్ స్పందించి మానవతా దృక్పథంతో సొంతగ సహాయం అందజేసిన వారి ఇరువురి కి కృతజ్ఞతలు తెలియజేశారు.  ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయడం జరుగుతుందన్నారు.

About Author