మృతురాలి కుటుంబానికి రూ .5వేలు ఆర్థిక సాయం
1 min readఆర్థిక సహాయం అందజేసిన పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి మంగ్ల వారం మృతురాలి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. పత్తికొండ ఎస్సీ కాలనీలో నివాసం వుంటూ , పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ లో సభ్యుడైయున్న హోటల్ కుమార్ భార్య గత కొంత కాలంగా గుండె సంభందిత వ్యాధితో బాధపడుతూ మరణించారు. విషయం తెలుసుకున్న పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి భాదిత కుటుంబానికి వార్డ్ మెంబెర్ లైట్ నాగరాజు, ఎంపీటీసీ అనిత 5000 /- ఆర్థిక సహాయం అందించారు. పోచిమిరెడ్డి సేవాదళ్ కుటుంబ సభ్యులకు యెల్ల వేళలా సహాయ సహకారాలు అందిస్తామని పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.