విద్యుత్ యూనియన్ తరపున ఆర్థిక సహాయం..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలంలోని గని విద్యుత్ సబ్ స్టేషన్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న చాకలి మధు రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో మృతుని కుటుంబానికి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ 3045 తరపున ఆర్థిక సహాయం అందజేయాలనే ఉద్దేశంతో యూనియన్ సభ్యుల ఆర్థిక సహాయంతో లక్ష రూపాయలు పోగు చేసి మొత్తాన్ని మృతుని కూతురు పేరు మీద ఎల్ఐసి లో ఫిక్స్ డిపాజిట్ చేశారు డిపాజిట్ బాండును నంద్యాల డివిజన్ విద్యుత్ ఈ ఈ రమణారెడ్డి చేతుల మీదుగా గురువారం నాడు మృతుని భార్య జయమ్మకు అందజేశారు ఈ సందర్భంగా ఈ ఈ మాట్లాడుతూ మృతుని భార్యకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లాల శరత్ కుమార్ . నంద్యాల డివిజన్ అధ్యక్షులు గోపాల్. కరీం. శ్రీనివాసరెడ్డి . మున్ని అనూష .లావణ్య. మధు. నాగేశ్వర్రెడ్డి. శ్రీనివాస్. సంజీవ .చిన్నికృష్ణ. విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.