NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెన్నూరు అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం  

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలం చెన్నూరు లోని సరస్వతి నగర్ లో రెండురోజుల క్రిందట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదం లో నష్ట పోయిన కుటుంబానికి రాష్ట్ర తెలుగు దేశం నాయకుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ కు సంబందించిన కమలాపురం నియోజక వర్గం చెన్నురు మండలం లోని  సాయినాథ్ శర్మ అభిమానులు పెద్ద బుద్ధి వెంకట శివ ప్రసాద్  ఆధ్వర్యం పది వేల రూపాయలు  ఆర్థిక సహాయం అందించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని మరోసారి రుజువు చేసిన కాశీభట్ల సత్య సాయినాథ అభిమానులు తమకు అగ్ని ప్రమాదం జరిగినా ఇంతవరకు ఎవరు ఎటువంటి ఆర్థిక సహయం చేయలేదని మండలం లోని సాయినాథ్ శర్మ  అభిమానులు తమను ఆదుకోవడం తమకు ఆనందాన్ని ఇచ్చిందని బాధితులు పేర్కొంటున్నారు, ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ అభిమానులు శివ, రాజారెడ్డి వెంకట నారాయణ రెడ్డి, చెంగా బ్రహ్మయ్య, షణ్ముఖ, సన్నబోయిన గంగాధర్ ,శివ నాయు బ్రాహ్మణ ప్రతినిధులు తదితరులు మాట్లాడుతూ,తమ నాయకుని నిరుపేద సేవ స్ఫూర్తి తో తాము ఈ సహాయం తమ వంతు బాధ్యతగా చేసినట్లు చెప్పారు.సమాజ సేవకు సాయినాథ్ శర్మ  సూచనలతో తాము తమ శక్తిమేరకు కృషి చేస్తామన్నారు.

About Author