సీనియర్ జర్నలిస్టుకు ఆర్థిక సహాయం
1 min read– జర్నలిస్టు లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
– నా వంతుగా జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా అండగా ఉంటా
– ప్రాణాయానము, యోగాసనం చేయాలని, మాంసాహారాన్ని తగ్గించి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి
పల్లవెలుగు వెబ్ కర్నూలు: సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులే జర్నలిస్టులని సమాజ సేవకుడు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూల్ నగరంలోని శ్రీరామ్ నగర్ లో అనారోగ్యానికి గురై గుండె ఆపరేషన్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్ట్ మధు ను పరమర్శించి ఆయన 5 వేలు రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు లు సరైన సమయంలో తిన్న లేక సరైన సమయంలో నిద్రాహారాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ విధి నిర్వాహనాలు చేస్తున్నారు. వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ జె ఎఫ్ ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామస్వామి చెన్నయ్యలు పాల్గొన్నారు.