సంక్షేమ పథకాల ద్వారా అర్హులకు.. ఆర్థిక సాయం..
1 min read– వాలంటీర్ల ద్వారా అర్హత ఉన్న వారిని గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి అర్హత మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నదని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ తెలిపారు. గురువారం జూపాడుబంగ్లా మండల కేంద్రంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం జూలై 1 నుండి ఆగష్టు 1 వరకు ఒక నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సచివాలయానికి ఒక రోజు కేటాయించి అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు గుర్తించి ప్రభుత్వం తరఫున అందించే జనన, మరణ, ఫ్యామిలి మెంబర్ సర్టిఫికేట్, ఆదాయ, కుల ధృవపత్రాలు ఇలా 11 రకాల ధృవపత్రాలను ఉచితంగా పొందవచ్చునని, ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానం కూడా చేసుకోవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలు, వికలాంగులు, రైతులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఒంటరి మహిళలకు సంక్షేమ పథకాలను అందించి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న వాలంటీర్లు వారికి కేటాయించిన 50 గృహాలలోని లబ్ధిదారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాల వివరాలను తెలియజేసి సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోతే బాలయ్య , వైసిపి మండల నాయకులు జంగాల పెద్దన్న ఎంపీటీసీ వెంకటమ్మ, కృపాకర్ , వైసిపి నాయకులు పోతులపాడు శివానందరెడ్డి, ఎర్రన్న , మల్లయ్య, మండల తహసిల్దార్ పుల్లయ్య యాదవ్ , మండల ఇన్చార్జి అభివృద్ధి అధికారి సుబ్రహ్మణ్య శర్మ ,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.