మత్స్యకారులకు ఆర్థిక భరోసా
1 min read– అర్హులైన కుటుంబానికి రూ. 10వేలు సహాయం
– వీసీలో సీఎం వైఎస్ జగన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కరోన కష్టకాలంలో ఆర్థిక భారం ఉన్నప్పటికీ… ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీసీలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 10వేలను వారివారి ఖాతాలో జమ చేశారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబానికి చేయూతనిచ్చేందుకు ఈ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో లక్షా 19,875 మత్స్యకార కుటుంబాలకు కంప్యూటర్ బటన్ నొక్కి వారి అకౌంట్లలోకిరూ. 120 కోట్లు జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొన్నాఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, మత్స్య శాఖ ఇంచార్జి జాయింట్ డైరెక్టర్ శ్యామలమ్మ, మత్స్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.