PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్థికపరమైన డిమాండ్ల సాధనకై ధర్నా.. ఏపీజేఏసీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శనివారం రాష్ట్ర జేఏసీ మరియు కర్నూలు జిల్లా జేఏసీ పిలుపుమేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల ఆర్థికపరమైన డిమాండ్ల సాధన కొరకు ఉద్యమ కార్యచరణలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం ఏపీజేఏసీ నగర చైర్మన్ శ్రీ ఎంసీ కాశన్న వారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా ఈ క్రింద తెలిపిన ఆర్థికపరమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించవలసినదిగా కర్నూలు నగర జేఏసీ పక్షాన డిమాండ్ చేయుచున్నాము. డిమాండ్లు

1. దాదాపుగా 100 నెలల పైబడిన కరువు భత్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలి

2. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి

3. 11వ పి.ఆర్.సి బకాయలు వెంటనే విడుదల చేయాలి

4. జిపిఎఫ్ మరియు ఏపీజీలై రుణాలను వెంటనే విడుదల చేయాలి

5. మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

6. పెన్షనర్ల బకాయాలను వెంటనే విడుదల చేయాలి

7. ఉద్యోగులపై భౌతిక దాడులను వెంటనే ఆపాలి

8. 12వ పి.ఆర్.సి ఆలస్యం అవుతున్నందున 30% మభ్యంతర భృతిని ప్రకటించాలి.

పైన ప్రకటించిన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి లేనియెడల రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు చలో విజయవాడ కార్యక్రమం కు లక్షల మందితో  విజయవాడ ముట్టడి కార్యక్రమం కర్నూలు నగర జేఏసీ పక్షాన చేపడుతామని ప్రభుత్వం వారికి హెచ్చరించడం అయినది.20వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వేల మందితో జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ మరియు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నామని ఈ ర్యాలీకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేయుచున్నాము.ఈ కార్యక్రమంకి ఈ క్రింది విధంగా ఉద్యోగ సంఘ నాయకులు హాజరవడం జరిగినది. ఏపీ జెఎసి కర్నూలు నగర చైర్మన్ శ్రీ యం సి కాశన్న, ఏపీ జెఎసి కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్లాల్, వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం అధ్యక్షులు కే రవి ప్రకాష్ రావు ఏపీ టైపిస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ శంకర్ నాయక్, ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల అధ్యక్షులు మద్దిలేటి, డ్రైవర్ల సంఘం అధ్యక్షులు నాగేశ్వరావు, ఆర్టీసీ నేషనల్ మద్దూర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు యన్.ఆర్. నాయుడు, పశుసంవర్ధక శాఖ లైవ్ స్టాక్ ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు,  కమర్షియల్ టాక్స్ ఉద్యోగుల అధ్యక్షులు నాగరాజు, రోడ్డు మరియు భవనాల శాఖ నాయకులు మల్లికార్జున ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్ బాషా, ఏపీటీఎఫ్ అధ్యక్షులు మరియానంద, ఫ్యాప్టో చైర్మన్ గోకారి, పెన్షనర్ సంఘం నాయకులు బాల వెంకటేశ్వర్లు, ఎన్జీవో  జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, బలరాంరెడ్డి నగర ఎన్జీవో నాయకులు శ్రీనివాసులు హరికృష్ణ గౌడ్ వ్యవసాయ సంఘ ఉద్యోగులు నాగ కిషోర్ మునీర్ అహ్మద్ యాసనుల్ల ఏపీ ఎన్జీవో జిల్లా మరియు నగర నాయకులు మరియు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు మెడికల్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

About Author