కార్పొరేట్ సంస్థల మధ్య ఆర్థిక విభేదాలు
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్ నందు హోటల్ డాక్టర్ బి.ఎస్.రావు గ్రూప్ సంస్థ సమావేశం నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఎస్.రావు మీడియాతో మాట్లాడుతూ లింగమనేని రమేష్ గ్రూపు వారు 900 కోట్లు కొట్ర మరియు మోసపూరిత విధానాలు తో మమ్మల్ని మోసం చేశారని దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేశామని తెలిపారు.డాక్టర్ బి ఎస్ ఆర్ రావు గ్రూపు వారు తమ విద్యాసంస్థలను విస్తృత చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న లింగమనేని రమేష్ గ్రూపు మమ్మల్ని సంప్రదించి మా విద్యాసంస్థలకు సంబంధించిన భూములు , భవనాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి 2013 సంవత్సరంలో ఎం ఓ యు లను కుదిర్చుకుందామని తెలిపారు .అప్పటినుండి లింగమనేని రమేష్ గ్రూపు వారు మాకు 2015, 2016 సంవత్సరాలలో మాకు ఇవ్వాల్సిన వడ్డీతో కలిపి నగదు చెల్లిస్తామని లింగమనేని గ్రూపు నమ్మించి అగ్రిమెంట్ రాసి ఇచ్చి మోసం చేశారని తెలిపారు.ఈ విషయంపై లింగమనేని రమేష్ గ్రూప్ పై హైదరాబాదు నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నందు ఎఫ్ఎఆర్ నమో చేయించామని తెలిపారు.ఈ విషయంపై లింగంమనేని రమేష్ గ్రూప్స్ వారికి నాంపల్లి మెట్రోపాలిటన్ స్టేషన్ కోర్ట్ చెక్కులకు సంబంధించిన 20 శాతం ఇంట్రం కాంపిసేషన్ ఇంటీరీం కాంపెన్సేషన్ చెల్లించమని ఆదేశించారని తెలిపారు.కానీ ఈ విషయంపై లింగమనేని రమేష్ గ్రూపు వారు హైకోర్టుని, సుప్రీంకోర్టుని అప్పిలికి వెళ్లగా సదరు హైకోర్టు, సుప్రీంకోర్టు, లు కూడా ఆపిల్ను తోసిపిచ్చిందని మెట్రోపాలిటీ మెజిస్టిక్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా నెరవేర్చాలని లింగమనేని రమేష్ గ్రూప్ కి ఆదేశించారు.కానీ లింగమనేని రమేష్ గ్రూపు బిఎస్ రావు గ్రూప్ కి ఇప్పటివరకు కూడా ఒక రూపాయి కూడా చెల్లించలేదని తెలిపారు.కోర్టు ధిక్కరణ కింద లింగమనేని రమేష్ గ్రూప్ కి నోటీస్, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ చెన్నై కోర్టు ఇచ్చిందని .ఈ కేసు చెన్నై కోర్టు లో పెండింగ్లో ఉందని తెలిపారు.ఈ విధంగా లింగమనేని రమేష్ గ్రూపు ప్రతి విషయంలో మోసం చేస్తే కోర్టు ధిక్కరణ చేస్తూ ప్రవర్తిస్తుందని బిఎస్సార్రావు గ్రూపు చైర్మన్ డి.ఎస్.రావు గారు తెలిపారు.