ఏపీలో ఆర్థిక అవకతవకలు.. కాగ్ నిర్ధారణ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ సర్కార్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని కేంద్రమంత్రి పంకజ్ ఆరోపించారు. ఆర్థిక అవకతవకల విషయాన్ని కాగ్ నిర్ధారించిందని పార్లమెంట్‌లో ఆయన ప్రస్తావించారు. వైఎస్‌ఆర్ గృహ వసతి పథకం ఖర్చుల్లో తేడాలున్నాయని తెలిపారు. ఏపీకి ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద రూ.324.15 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద రూ.570.91 కోట్లు మంజూరు చేశామని పంకజ్ పేర్కొన్నారు. 2020 కాగ్ నివేదిక ప్రకారం రూ.1,100 కోట్ల డిజాస్టర్ నిధులను.. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ అకౌంట్‌కు మళ్లించిందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో నష్టపోయిన రైతులకు సబ్సిడీ కోసం.. డబ్బులు మళ్లించినట్టు ఏపీ తప్పుగా పేర్కొందని తెలిపారు. రూ.1,100 కోట్లను విపత్తు సహాయ పునరావాస చర్యల కోసం.. ఖర్చు చేసినట్టు చూపడం చట్ట ఉల్లంఘనేనని తప్పుబట్టారు.