ఏపీలో ఆర్థిక అసమానతలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రానున్న తరాలకు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. అప్పులను జగన్ స్వార్థానికే వాడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. అప్పులకు లెక్కలు లేకపోవడమే నిధుల దుర్వినియోగానికి సాక్ష్యమన్నారు. జగన్ మోసాలను నమ్మితే ఏపీ భవిష్యత్ అంధకారమేనని యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు.