ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ.. రాష్ట్రపతికి లేఖ !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీ ఆర్థిక పరిస్థితిపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆయన అన్నారు. ఆర్టికల్ 360 ద్వార ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. డిసెంబర్ నాటికే ఆర్థిక లోటు 68,536 కోట్లు దాటిందని, ఉద్యోగులకు జీతాలివ్వడం కూడ గగనమైందన్నారు. జులై రెండో వారంలో ఉద్యోగులకు జీతాలివ్వలేదని అన్నారు. కేంద్ర నుంచి తగిన నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని ఎంపీ రఘురామ కోరారు.