26 నుంచి మార్చి ఒకటి వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు
1 min readజిల్లా రెవిన్యూ అధికారి కె మధుసూదన్ రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలనిజిల్లా రెవిన్యూ అధికారి కె మధుసూదన్ రావు మంది అధికారులకు తెలియజేశారు.సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించె”ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు.. 2024″ వాల్ పోస్టర్ లను జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు ఆవిష్కరించారు.డిఆర్ఓ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 28వ తేదీన మున్సిపల్ హై స్కూల్, ఎమ్మిగనూరులో స్కూలు విద్యార్థులకు క్విజ్ ఈవెంట్ ను, 29వ తేదీ న కె.వి.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (మహిళలు) వారికి క్రాస్వర్డ్ ఈవెంట్ ఆర్థిక అక్షరాస్యత మీద నిర్వహించడం జరుగుతుందని అందులో గెలుపొందిన విద్యార్థులకు మంచి ప్రైజ్ మనీ అందిస్తామని తెలియజేశారు. అదే విధంగా ఈ కార్యక్రమ ముగింపు దశలో మార్చి 1వ తేదీన ఆదోని మున్సిపల్ హైస్కూల్లో, మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పిస్తూ ఉదయం ఎనిమిది గంటలకు వాకతాన్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు చేశారు.