ఆర్థిక అక్షరాస్యత భవిష్యత్తుకు బంగారు బాట..
1 min readఏపీజీబీ మేనేజర్ వర్జిల్ జాన్..
పల్లెవెలుగు న్యూస్ గడివేముల : పొదుపు చేయటం క్రమశిక్షణతో కూడిన భవిష్యత్తుకు బంగారు బాటగా ఉపయోగపడుతుందని శుక్రవారం నాడు గడివేములలోని శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో ఏపీజీబీ మేనేజర్ వర్జిల్ జాన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బును బాల్యం నుండే పొదుపు చేయడం నేర్చుకోవాలని మంచి క్రమశిక్షణతో డబ్బు ఉపయోగించాలని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని పొదుపు అలవాటును చేసుకోవడం వల్ల భవిష్యత్తులో తమ అవసరాలకు డబ్బు ఉపయోగపడుతుందని ఆర్థిక అక్షరాస్యత పై బ్యాంకింగ్ సేవలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు ఆన్లైన్ బ్యాంకింగ్ లోన్స్ తదితర విషయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ మేనేజర్ ప్రేమ్ సాగర్ . హెడ్మాస్టర్ రఘు.ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.