మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో .. ఇలా తెలుసుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్: మనకు తెలియకుండా మన పేరు మీద ఎన్నో ఫోన్ నంబర్లు ఉండే అవకాశం ఉంది. మన అడ్రస్ ప్రూఫ్ ఉపయోగించి కొందరు.. మనకు తెలియకుండా సిమ్ కార్డులు కొనే అవకాశం లేకపోలేదు. అందుకే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలీకాం డిపార్ట్ మెంట్ ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మనకు తెలియకుండా మన పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అందుకోసం టెలికాం డిపార్ట్ మెంట్ ఒక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. http://tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ లో మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే.. మన మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని సదరు వెబ్ సైట్ లో నమోదు చేస్తే.. మన పేరు మీద ఉన్న ఫోన్ నెంబర్లు వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరు మీద ఉన్నవి నంబర్లను సెలెక్ట్ చేసి.. సబ్మిట్ చేస్తే టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది.