మీ ఆధార్ కార్డ్ నిజమైనదో.. నకిలీదో ఇలా తెలుసుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇప్పుడు ప్రతి వ్యవహారం ఆధార్ తో అనుసంధానించబడింది. అయితే.. ఎక్కడైనా ఆధార్ కార్డు ఇచ్చే ముందు ఒకసారి ఆధార్ కార్డ్ నిజమైనదో.. నకిలీదో తెలుసుకోవాలని యూఐడీఏఐ చెబుతోంది. ప్రతి విషయంతో ముడిపడి ఉన్న ఆధార్ కార్డుకు సంబంధించిన ఫేక్ కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ సమర్పించే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలని యూఐడీఏఐ చెబుతోంది. ఇందుకోం
- resident.uidai.gov.in/verify లింక్ పై క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డ్ పై ఉన్న 12 డిజిట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
- కింద ఉన్న సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను క్లిక్ చేసి వెరిఫై కొట్టాలి.
-అప్పుడు ఆధార్ నెంబర్ నిజమైనదో.. నకిలీదో తెలుస్తుంది.