మీ పాన్ కార్డ్ నిజమైందో.. నకిలీదో .. ఇలా గుర్తించండి
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్, పాన్ కార్డ్ తప్పనిసరి అయింది. బ్యాంక్ అకౌంట్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఇలా ఏది తీసుకోవాలన్న సరే పాన్ కార్డు అవసరం. అయితే.. పాన్ కార్డ్ ను సైబర్ నేరగాళ్లు.. తమ నేర కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరగాళ్ల ఆటకట్టించాలంటే మీ పాన్ కార్డ్ నిజమైందో .. కాదో తెలుసుకోవాలి.
ఇలా తెలుసుకోండి :
- ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
- అవర్ సర్వీసెస్ విభాగంలో
వెరిఫై యువర్ పాన్
అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. - ఇప్పుడు మీ పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేది, మొబైల్ నెంబర్ నమోదు చేసి
కంటిన్యూ
పై క్లిక్ చేయాలి. - ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి క్లిక్ చేసి
ప్రొసీడ్
నొక్కాలి. - ఇప్పుడు మీ పాన్ సరైనదే అయితే..
పాన్ ఈజ్ యాక్లివ్ అండ్ డీటైల్స్ ఆర్ యాస్ పర్ పాన్
అనే మెసేజ్ వస్తుంది.