PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ ఫోన్ హ్యాక్ అయిందో.. లేదో తెలుసుకోండి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కంప్యూటర్‌ వైరస్‌, ట్రోజన్స్‌, స్పైవేర్‌, రాన్సమ్ వేర్, యాడ్‌వేర్‌, వార్మ్స్, ఫైల్‌ లెస్‌ మాల్వేర్ ల స‌హాయంతో సైబ‌ర్ నేర‌స్తులు దాడుల‌కు పాల్పడుతున్నట్టు డ‌బ్ల్యూహెచ్వో ఆందోళ‌న వ్యక్తం చేసింది. ఈ త‌రహా దాడుల‌కు మెషిన్ లెర్నింగ్ వినియోగిస్తున్నారు. వైర‌స్ ను మెయిల్స్ సాయంతో, లేదంట ఆఫ‌ర్లు ఇస్తామంటూ పాప్ అప్ యాడ్స్ పంపిస్తారు. యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకునే ముందు వాటి వివ‌రాలు చెక్ చేసుకోవాలి.
ఇలా తెలుసుకోండి :

  1. మీ ఫోన్ చార్జ్ చేస్తుంటే వెంట‌నే క‌ట్ అవ్వడం, మీ ఫోన్ కు గుర్తుతెలియ‌ని వ్యక్తుల నుంచి ఫోన్లు, మెసేజ్ లు రావ‌డం, మీ అనుమ‌తి లేకుండా యాప్స్ కొనుగోలు చేయ‌డం.
  2. కంట‌న్యూగా మీ ఫోన్ కు యాడ్స్ వ‌స్తున్నా యాడ్ వేర్ మీ ఫోన్ ను అటాక్ చేసిన‌ట్టు గుర్తించాలి.
  3. మాల్వేర్, ట్రోజ‌న్ మీ స్మార్ట్ ఫోన్ ఉప‌యోగించి స్పామ్ టెక్స్ట్ , మెసేజ్ ల‌ను మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నావారికి సెండ్ చేస్తుంటాయి. మీ కాంటాక్ట్ ఫోల్డర్ లోని గుర్తు తెలియ‌ని వ్యక్తులు ప్రవేశించిన‌ట్టు గుర్తించాలి.
  4. స్మార్ట్ ఫోన్ ప‌నితీరు బాగా త‌గ్గిపోతుంది.
  5. మీ స్మార్ట్ ఫోన్ లోకి కొత్త యాప్ లను వైర‌స్ , మాల్వేర్ లు డౌన్ లోడ్ చేస్తుంటాయి.
  6. యాప్ లు, మెసేజ్ ల వ‌ల్ల మీ డేటా మొత్తం అయిపోతుంది.
  7. బ్యాట‌రీ లైఫ్ టైమ్ త‌గ్గిపోతుంటుంది.

About Author