PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌ర్షాకాలంలో ఏం తినొచ్చు.. ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వ‌ర్షాకాలం.. సీజ‌న‌ల్ వ్యాధుల‌కు ఎక్కువ అవ‌కాశం ఉంటుంది. ఈ రోజుల్లో సాధార‌ణ రోజులు కంటే జాగ్రత్తగా ఉండాలి. ఆహార అలావాట్ల కార‌ణంగా సీజ‌న‌ల్ వ్యాధుల‌తో అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశం ఉంటుంది.

  • వ‌ర్షం ప‌డితే వేడి, వేడి బ‌జ్జీలు, స‌మోసాలు తినాల‌నే ఆశ చాలా మందికి ఉంటుంది. వెంట‌నే వండుకుని తినేస్తారు. బ‌జ్జీలు, స‌మోసాలు మితంగా తింటే స‌రిపోతుంది. వాతావ‌ర‌ణం చ‌ల్లగా ఉంది క‌దా అని.. ఎక్కువ‌గా తింటే జీర్ణక్రియ స‌మ‌స్యలు ఉత్పన్నం అవుతాయి. వీటిని వేయించ‌డానికి వాడే నూనె వ‌ల్ల కూడ ఇబ్బందులు క‌లుగుతాయి.
  • వ‌ర్షాకాలంలో ఆకుకూర‌లు తిన‌క‌పోవ‌డం మంచిది. ఎందుకంటే వీటిలో బాక్టీరియా, ఫంగ‌స్ వంటివి ఉండే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ తినాలి అనుకుంటే.. వాటిని బాగా క‌డిగి, ఉడ‌క‌బెట్టి తినాలి.
  • బాక్టీరియా, ఫంగ‌స్ పెరుగుద‌ల‌కు వ‌ర్షాకాల‌పు వాతావ‌ర‌ణం అనువుగా ఉంటుంది. అప‌రిశుభ్రంగా ఉండే ఏ చోటైన వీటి పెరుగుద‌ల‌కు అనువుగా ఉంటుంది. అప‌రిశుభ్రంగా ఉండే చోట ఆహారం తిన‌కూడ‌దు.
  • కూల్ డ్రింక్స్, ఇత‌ర చ‌ల్లని పానీయాలు తాగ‌కూడ‌దు.
    ఇవి తినొచ్చు :
  • ఈ సీజ‌న్లలో పోష‌కాలు, విట‌మిన్లు అధికంగా తీసుకోవాలి. ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూర‌గాయ‌లు తినాలి.
  • నీరు, సూప్, హెర్బల్ టీ వంటివి తాగుతూ.. శ‌రీరంలో నీరు, ల‌వ‌ణాలు స్థాయిని స‌మ‌తుల్యంగా ఉంచుకోవాలి. ఈ కాలంలో నీరు క‌లుషితం అయ్యే స‌మ‌స్యలు ఉంటాయి కాబ‌ట్టి.. నీటిని వేడి చేసుకుని తాగ‌డం మంచిది.

About Author