మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో .. ఇలా తెలుసుకోండి..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన సమయంలో యూనిక్ ఐడెంటిఫికేష్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మీ ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకునే విధంగా కొత్త సర్వీసును తీసుకొచ్చింది. కింద ఇవ్వబడిన పద్దతిలో మీ మొబైల్, లాప్ టాప్, కంప్యూటర్ ద్వార మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన సమాచారం తెలుసుకోవచ్చు.
- మొదటి యూఐఏడిఐ https://uidai.gov.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత హోమ్ పేజీలోని ఆధార్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి.
- అనంతరం మీకు కనిపించే ఆధార్ లింకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి.
- దాని తర్వాత ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
- ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.