మంత్రి పై ఎఫ్ఐఆర్ నమోదు
1 min readపల్లెవెలుగువెబ్ : కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో చిక్కుల్లో పడిన కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై బుధవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఆయన పేరు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. ఉడిపి హోటల్లో అనుమానాస్పద స్థితిలో సంతోష్ పాటిల్ మంగళవారం మృతి చెందడం సంచలనమైంది.