జిందాల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
1 min read
ఒకరికి గాయాలు
పల్లెవెలుగు వెబ్, గడివేముల: కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. కర్మాగారంలో రామిల్ సెక్షన్ పరిసరాల్లో హజర్డస్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ నిల్వ ఉంచే ప్రాంతంలో అగ్గిరవ్వ లు ఏర్పడి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన యాజమాన్యం ఫైర్ ఇంజన్ లతో మంటలను ఆర్పివేశారు. మంటలను ఆర్పివేసే క్రమంలో సద్దాం సూపర్ వైజర్ బీహార్ వాసి స్వల్పంగా గాయపడడంతో హుటాహుటిన ఉదయానంద ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తహసిల్దార్ నాగమణి, ఎస్సై శ్రీధర్ ను పరిశ్రమను పరిశీలించి.. యజమానులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ , ఆస్తి నష్టం జరగలేదని ప్రమాదాలు జరగకుండా పరిశ్రమలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ సిస్టం పరిశ్రమ మొత్తం ఏర్పాటు చేసినట్టు హెచ్ఆర్ మేనేజర్ సాంబశివరావు తెలిపారు. ఈ సంఘటన జరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.