టైగర్ రిజర్వ్ లో మంటలు.. అదుపులోకి రాని పరిస్థితి
1 min readపల్లెవెలుగువెబ్ : రాజస్థాన్‌లోని సరిస్క టైగర్ రిజర్వ్ మంటల్లో చిక్కుకుంది. సోమవారం రాత్రి చెలరేగిన మంటలు క్రమంగా విస్తరిస్తూ ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. 10 చదరపు కిలోమీటర్ల వరకూ మంటలు విస్తరించడంతో వీటిని అదుపు చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. హైడ్రాలిక్ విధానంలో నీళ్లను కుమ్మరిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సైతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్ సిలిసెర్హ్ చెరువు నుంచి నీళ్లు నింపుకుని మంటల పరిస్థితిని అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. గాలుల కారణంగా 24 గంటలైనా మంటలు అదుపులోకి రాకపోవడంతో టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని మూడు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.