PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్పీ కార్యాలయంలో మొదటి వార్షికోత్సవ సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తి అయిన సందర్బముగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పీ.ఎస్. గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పడినప్పుడు రాళ్ళ, ముళ్ళ పొదలతో నిండి ఉన్న జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ను అధికారుల ప్రోత్సాహం తో సిబ్బంది సమిష్టి కృషితో సర్వాంగసుందరంగా మరియు పచ్చని చెట్లతో చూడ చక్కనైన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పీ.ఎస్ గారు తెలియజేసారు. జిల్లా కలెక్టర్ శ్రీ పి.ఎస్.గిరీష ఐ.ఎ.ఎస్ గారి సహకారం తో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే పండుగలను మన రాయచోటి పెరేడ్ గ్రౌండ్ లో జరుపుకున్నాము. ఈ సంవత్సర కాలంలో, జిల్లా లో శాంతి బద్రతలను కాపాడడంలో, నేరాలను అదుపు చేయడంలో, జిల్లా పోలీస్ లు ఎంతో కృషి చేసినారు. ఈ సంవస్తర కాలంలో జిల్లలో 80 శాతం దొంగ తనం కేసు లు ను చేదిన్త్చి ప్రాపర్టీ ని రికవర్ చేయడం జరిగింది. అదే విధంగా రోడు ప్రమాదాలను నివారించడానికి సుమారు 3 లక్షలకు పై కర్చుతో వివిధ పరికరాలను రహదారులపై ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా లో ప్రజలు ఎక్కువ శాతం జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశాలకు వెళ్ళడం జరుగుతున్నది, అక్కడికి వెళ్ళిన తరువాత వారు పడుతున్న ఇబ్బందులను గమనించి ఇమిగ్రేసన్ హెల్ప్ డెస్క్ నెంబర్ 8688830014 ను ప్రారంబించి ఫిర్యాదు చేసిన వారికి పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజల జీవన విధానంలో ఎంతో ముక్య పాత్ర వహిస్తున్న మొబైల్ ఫోన్లను పోగొట్టుకోవడం వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయ పడే విధంగా మిస్డ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఇప్పటి వరకు విలువ రూ.49 లక్షలు విలవ చేసే 239 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి భాదితులకు అందజేయడం జరిగిందన్నారు . సైబర్ నేరగాళ్ల వలన జరుగు మోసాలను అరికట్టే దిశగా ఆధునిక పరికరాలతో సైబర్ సెల్ యూనిట్ ను ప్రారంబిన్చామన్నారు . అన్నమయ్య జిల్లాలో నేరాలను తగ్గించడంలో మరియు పెండింగ్ లో వున్న కేసులను తగ్గించడంలో, ఎన్నికలలో ఎటువంటి అవాంఛనియ్య సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొంధగాలిగామన్నారు. ఇక మీదట కూడా జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమిష్టిగా కృషి చేసి జిల్లాలో పోలీసులకు మంచి పేరు తీసుకొని రావాలని బాగా కృషి చేశారని, ఇలాగే నూతన ఉత్సాహంతో మనమందరం కలిసి పనిచేసి జిల్లా లో నేరాల తగ్గింపుకు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.

About Author