PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

18 ఏళ్లకే ఫస్ట్ కిస్..!

1 min read

త‌న 18 ఏళ్ల వ‌య‌సులోనే ఫ‌స్ట్ కిస్ అనుభ‌వాన్ని పొందాన‌ని అన్నారు బాలీవుడ్ న‌టి పూజ భ‌ట్. పూజ భ‌ట్.. బాలీవుడ్ న‌టుడు మ‌హేష్ భ‌ట్ కూతురు. ‘ స‌డ‌క్’ సినిమాలోని ఓ స‌న్నివేశంలో భాగంగా మొద‌టి ముద్దు సీన్ లో న‌టించాన‌ని తెలిపారు. ‘నాన్న ముందు ముద్దు సీన్ లో న‌టించాలంటే.. చాలా భ‌యం వేసింది. అప్పుడు నా వ‌య‌సు 18 ఏళ్లు. ఆ సీన్ లో న‌టించాలంటే వ‌ణుకుపుట్టింది. అప్పుడు నాన్న న‌న్ను ప‌క్కకు తీసుకెళ్లి.. ముద్దులో నువ్వు వ‌ల్గారిటీ చూస్తే.. నీకు వ‌ల్గారిటీనే క‌నిపిస్తుంది. ఆ సీన్ ను గౌర‌విస్తే.. సీన్ ఎంతో గొప్పగా వ‌స్తుంద‌ని చెప్పాడు‘ అని కెరీర్ ప్రారంభంలోని సంగ‌తులు ఓ ఇంట‌ర్వ్యూ లో గుర్తు చేసుకుంది న‌టి పూజ భ‌ట్.

About Author