PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి

1 min read

– ఈనెల 9,10 తారీకుల నందు మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుంది.

– జిల్లా రెవెన్యూ అధికారి కే మధుసూదన్ రావు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో జరుగుతున్న ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం ఈరోజుతో పూర్తి అయి ఈనెల 9,10 తారీకుల నందు మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి.కే మధుసూదన్ రావు తెలియజేశారు.బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 లో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో డిఆర్ఓ కే మధుసూదన్ రావు సమావేశం నిర్వహించారు.డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్16 వ తేదీన మొదలైన ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం ఈరోజుతో పూర్తి అయిందని ఈనెల 9,10 తారీకులు గురువారం శుక్రవారం లయందు కలెక్టరేట్ నందు  మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుంది ఈ మాక్ పోల్ నందు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని వారి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గురు మరియు శుక్రవారం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల వారు ఫోటో గుర్తింపు కార్డుల కొరకు బూత్ స్థాయి ఏజెంట్లకు సంబంధించిన లిస్టును సమర్పించాలని డిఆర్ఓ రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు. ఎన్నికలకు సంబంధించిన స్పెషల్ క్యాంపెయిన్ ను ఈనెల 04 మరియు05 తారీకు లయందు నిర్వహించడం జరిగిందని తదుపరి స్పెషల్ క్యాంపెయిన్ ను డిసెంబర్ నెల 02 మరియు03 తారీకులలో నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. అబ్జెక్షన్స్, క్లెయిమ్స్ ఏమైనా ఉంటే నిర్ణీత ఫారాలలో డిసెంబర్ 9వ తారీఖు లోపల సంబంధిత AERP/ERO/BLO లకు అందజేయాలని డిఆర్ఓ తెలియజేశారు.రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ఫామ్6,7,8 లకు సంబంధించి ఎన్ని పెండింగ్ ఉన్నాయి అన్న విషయాన్ని ప్రతివారం వాటి ప్రగతి గురించి మాకు తెలియజేయాలని, డిఆర్ఓ ను కోరారు. క్రిష్ణగిరి మండలంలో కొంతమంది బిఎల్ఓ లు విధులకు సక్రమంగా రావడం లేదని డిఆర్ఓ కు తెలిపారు. డిఆర్ఓ స్పందిస్తూ అలా ఏదైనా ఉంటే వ్రాతపూర్వకంగా ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమం లో టిడిపి, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.

About Author