ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన
1 min read– జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలనను జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆకస్మికంగా పరిశీలించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఈవీఎంల భద్రత గోడౌన్లో జరుగుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన (FLC)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్లకు సంబంధించి FLC కార్యక్రమం బెల్ ఇంజనీర్లు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది సహకారంతో లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. జిల్లాకు వచ్చి ప్రస్తుతం గోడౌన్ లో నిల్వ ఉన్న 3003 కంట్రోల్ యూనిట్లు, 5129 బ్యాలెట్ యూనిట్లు, 4922 వివి ప్యాట్ల ప్రథమ స్థాయి పరిశీలన ఇప్పటివరకు పూర్తయిందని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి కలెక్టర్ కు వివరించారు. ఇంకా 1355 కంట్రోల్ యూనిట్లు, 1960 బ్యాలెట్ యూనిట్లు,1960 VVPAT ల ప్రథమ స్థాయి పరిశీలన ప్రక్రియను వచ్చేనెల 10 వ తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.