ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీలు…
1 min readఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డాక్టర్ జి. సృజన,
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం ను 4 వ రోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీలను జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డాక్టర్ జి. సృజన, పరిశీలించారు.గురువారం స్థానిక కలెక్టరేట్ లోని ఈ.వి.యమ్ గోడౌన్ లో జరుగుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీలను జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డాక్టర్ జి. సృజన పరిశీలించారు.జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం ను రోజువారి తనిఖీ కార్యక్రమంలో భాగంగా 4 వ రోజు కేంద్రాన్ని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం విజిటర్ రిజిస్టర్ లో సంతకం చేశారు.ఈ కార్యక్రమంలో ఈవీఎం ల FLC(ఫస్ట్ లెవెల్ చెకప్) నోడల్ అధికారి మరియు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.