PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూపాయి డాక్టర్ కు మొదటి ప్రాధాన్యత ఓటేయండి

1 min read

– మాధవ స్వామి జిల్లా అధ్యక్షులు ఏ పి టి ఎఫ్

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో ఉన్నత విలువలు కలిగిన ఉన్నత విద్యావంతుడు రూపాయికి వైద్యం అందిస్తున్న డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి గారికి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి. మాధవస్వామి కోరారు. సంజామల కోవెలకుంట్ల మండలాలలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ లండన్ పౌరసత్వంతో 16 సంవత్సరాలు లండన్ లో డాక్టర్ గా పనిచేసే తిరిగి తన మాతృదేశానికి సేవ చేయాలని సదుద్దేశంతో వచ్చి ఒక రూపాయికి వైద్యం అందిస్తున్న డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో ఉయ్యాలవాడ మండల అధ్యక్షులు ఇ. రామాంజనేయులు నాయకులు రామకృష్ణ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author