వరుసగా ఐదు డిపిలు ..ఆందోళనలో లబ్ధిదారులు
1 min read– జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం మధ్యలోనే 11 కె.వి సామర్థ్యం ఉన్న ఐదు
కరెంటు డిపిలు
– కరెంటు డిపిల నిర్మాణంతో బాంబేలు ఎత్తుతున్న లబ్ధిదారులు
– ప్రాణాపాయం జరుగుతే బాధ్యత ఎవరు వహిస్తారు
– బడ్జెట్ మిగలదని గృహ నిర్మాణ మధ్యలోనే కరెంటు డిపిలు వేస్తున్న కాంట్రాక్టర్
– సొంత లాభం కోసం గృహ నిర్మాణం దగ్గర లో కరెంటు డిపిలు వేసి చేతులు దులుపుకుంటున్న కాంట్రాక్టర్
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : స్థానిక జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం మధ్యలోనే వరుసగా ఐదు కరెంటు డిపిలు నిర్మాణం జరుగుతుంది.ప్రాణాపాయం జరుగుతే బాధ్యత ఎవరు వహిస్తారు అని లబ్ధిదారులు వాపోతున్నారు.ప్రమాదకరమైన హెచ్చరికలతో కరెంటు డిపిలను ఎవరు తిరగని స్థలంలో చివరిలో నిర్మాణం చేస్తారు. కానీ కరెంటు అంటే ప్రమాదం అని తెలిసికూడా జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం వీధుల మధ్యలోనే 11 కెవి సామర్థ్యం కలిగిన డిపిలను నిర్మాణం చేయడంతో జగనన్న కాలని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహా సంకల్పంతో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరాలని స్థలము మంజూరు చేసి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కూడా అందిస్తు పెదవాడి కళ నేరవేస్తున్నారు. ప్యాపిలి పట్టణ జగనన్న కాలనీలో సొంత ఇంటికల నెరవేరింది అనుకున్న పేదవాడు ఇంటి ముందరనే కరెంట్ డిపి లోని నిర్మించడంతో సొంత ఇల్లు వచ్చిందని సంతోషపడాలో కరెంటు డిపిలు నిర్మాణంతో భయపడాలలో వారికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ జగనన్న కాలనీలోకి అడుగుపెట్టిన దాఖలు లేవు విషయనికి కొస్తే జగనన్న గృహాలను వేగవంతం చేయాలి, వేగవంతం చేయాలి అంటారు తప్ప కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయని పరిశీలించక కరెంటు డిపి ల నిర్మాణము ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని లబ్ధిదారులు ఆపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిన్ను కాలనీలోని ఇంటి నిర్మాణం వీధుల్లో మధ్యలో ఉన్న కరెంటు డిపిలను తొలగించి కాలనీ చివరిలో కరెంట్ డిపిలను నిర్మాణం చేయలని లబ్దిదారులు కోరుతున్నారు.