అట్టుడుకుతున్న విశాఖ
1 min readస్టీల్ ప్లాంట్ అమ్మకం పై కేంద్రం కీలక ప్రకటన
భగ్గుమన్న కార్మికులు
ఆందోళనతో అట్టుడుకుతున్న విశాఖ
విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మాల సీతారామన్ సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని ప్రకటించడంతో ఆందోళనలు మిన్నంటాయి. కేంద్రం చేసిన ప్రకటన ప్రతులను తగలబెట్టారు. మోడీ, జగన్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. రాత్రి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఆందోళనలు మొదలయ్యే అవకాశాలు కూడ ఉన్నాయి. కూర్మన్నపాలెం జాతీయ రహదారిలో కార్మికులు మానవహారంతో నిరసనన తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ డైరెక్టర్ ఆఫ్ పైనాన్స్ వాహనాన్ని కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో .. పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది.