ఫ్లోరోనా వ్యాధి.. తొలికేసు నమోదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇజ్రాయిల్ దేశంలో ఫ్లోరోనా తొలికేసు నమోదైంది. కరోన వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న వేళ.. ఫ్లోరోన మొదటి కేసు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయిల్ లో తొలి ఫ్లోరోనా కేసు నమోదైనట్టు అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఫ్లోరోనా అంటే కోవిడ్-19, ఇన్ ఫ్లూయెంజా డబుల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఈ తరహా కేసు నమోదు కావడంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు ఇజ్రాయిల్ లో కరోన నాలుగో టీకా డోసు అందించడం ప్రారంభించారు. ఇజ్రాయిల్ అధికార గణాంకాల ప్రకారం కొత్తగా 5,000 కేసులు నమోదయ్యాయి.