ఎఫ్‌ఎన్‌సీసీ ఎన్నికలు నేడే
1 min read
పల్లెవెలుగువెబ్: ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికలు నేడు జరుగు తున్నాయి. మొత్తం 1991 సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కె.ఎల్ నారాయణ, అల్లుఅరవింద్, సురేష్ బాబు సంయుక్త ప్యానెల్‌లు పోటీ పడుతున్నాయి. అధ్యక్షుడిగా జి. ఆదిశేషగిరిరావు బరిలో నిలిచారు. బండ్ల గణేష్ ఉపాధ్యక్ష పదవికి స్వతంత్రంగా పోటీలో నిలిచారు. కార్యదర్శి పదవికి కె.ఎస్ .రామారావు పోటీ పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం ఫలితాలు వెలువడతాయి.