గ్రామ సచివాలయాల్లో పౌర సేవలపై దృష్టి పెట్టండి
1 min read– జిల్లా పంచాయతీ అధికారి మంజుల వాణి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : గ్రామ సచివాలయంలో ప్రభుత్వం ఇచ్చే పౌర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదేవిధంగా సూచిక బోర్డుల్లో వివిధ పౌర సేవల పట్టికను ప్రదర్శించాలని శుక్రవారంనాడు నంద్యాల జిల్లా పంచాయతీ అధికారిని మంజుల వాణి ఆదేశించారు మండలంలోని చిందుకూరు గడిగరేవుల గ్రామ సచివాలయాలను సందర్శించారు ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసి సమయానికి విధులకు హాజరుకావాలని రోజువారి కార్యకలాపాలపై రిజిస్టర్ నిర్వహించాలని సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవన్నారు అనంతరం మంచాలకట్ట గ్రామ శివారులో ఉన్న చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించి సేంద్రియ ఎరువు ఉత్పత్తి వివరాలను ఈఓఆర్డిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అన్ని చెత్త సంపద కేంద్రాలలో ఎరువు ఉత్పత్తి అయ్యేలా సేకరించిన తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ప్రాసెసింగ్ చేసి గ్రామాల్లో పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు డిపిఓ వెంట ఈఓఆర్డి అబ్దుల్ ఖాలిక్ పంచాయతీ కార్యదర్శులు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.