‘కోవిడ్’పై ఫోకస్..
1 min readబాధితులకు మెరుగైన సేవలు అందించండి..
– ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించిన కలెక్టర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ సూపరింటెండెంట్లను ఆదేశించారు కర్నూలు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ హాస్పిటల్ మేనేజ్మెంట్లుతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై, వెంటిలేటర్, ట్రీట్మెంట్, మెడిసిన్స్, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది… ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకొని పాజిటివ్ బాధితులకు వెంటనే వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రిలో సేవలు, శానిటేషన్, నాణ్యమైన ఆహారం, క్వాలిటీ ఆఫ్ మెడికేషన్ తో పాటు సమయానికి మందులు అందించడం చాలా ముఖ్యమన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ రామ్ గిడ్డయ్య, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, ప్రభుత్వ మరియు ప్రవేట్ హాస్పిటల్ సూపర్ డెంట్స్, హాస్పిటల్ నోడల్ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.