డిజిటల్ లావాదేవీలపై మొగ్గు చూపండి: ఏపీజీబీ ఆర్ఎం భాస్కర్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఖాతాదారులు, ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపు అడుగు వేయాలని పిలుపునిచ్చారు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ ఎస్. భాస్కర్ రెడ్డి. కర్నూలు నగరంలోని ఏపీజీబీ రీజనల్ కార్యాలయంలో ‘ ఫైనాన్సియల్ లిటరసీ –2022’ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం ఎస్. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గు చూపాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సైబర్ నేరాలకు తావివ్వకుండా డిజిటల్ లావాదేవీల వైపు అడుగులేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీజీబీ ద్వారా అన్ని రకములైన ఆన్లైన్ సేవలను ఖాతాదారులకు అందిస్తున్నామని తెలియజేశారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘ ఫైనాన్షియల్ లిటరసీ –2022’ వారోత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని, డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ మేనేజర్స్ ACS రెడ్డి, కృష్ణమూర్తి మరియు RO సిబ్బంది పాల్గొన్నారు.