PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెకండ్​ వేవ్​పై .. ఫోకస్​

1 min read
మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

కరోనాపై అన్ని విధాలా సిద్ధం కండి
– వైరస్​ కట్టడిపై నోడల్ అధికారులతో సమీక్షించిన కర్నూలు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం కావాలని కోవిడ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ లపై కోవిడ్ జిల్లా నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, డిస్ట్రిక్ట్ కోవిడ్ కోఆర్డినేషన్ ఆఫీసర్ డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, జిల్లా అధికారులు, కోవిడ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోందని, గురువారం ఒక్క రోజే 600 కేసులు నమోదయ్యాయన్నారు. లాక్ డౌన్ లేకుండానే అధికారులు అందరం కలిసి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు.
ట్రేసింగ్​.. టెస్టింగ్​.. పకడ్బందీగా ఉండాలి : సెకండ్ వేవ్ కోవిడ్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్​ జి. వీరపాండియన్​.. కాంట్రాక్ట్​ ట్రేసింగ్​, టెస్టింగ్​ పకడ్బందీగా చేపట్టాలన్నారు.హోమ్ ఐసోలేషన్ లో ఉండేందుకు వసతులు లేని పక్షంలో వారిని వెంటనే కోవిడ్ కేర్ హాస్పిటల్ తరలించాలన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని టిడ్కో హౌస్ లను కోవిడ్ కేర్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని ఫుడ్, శానిటేషన్, బెడ్స్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా కోవిడ్ ఆసుపత్రిల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ లను సిద్ధంగా ఉంచుకోవలన్నారు. కోవిడ్‌ పరీక్ష మొదలు.. వైద్యం, ఆస్పత్రులలో మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్‌ ఫుడ్‌ వరకు..ఎక్కడా కూడా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. కోవిడ్ కి సంబంధించి 104 కాల్ సెంటర్, 1092 కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులును వెంటనే వంద క్లియర్ చేయాలన్నారు. 104 కాల్ సెంటర్ కు ఫిర్యాదు వచ్చిన వెంటనే మూడు గంటల లోపు టెస్టింగ్ పూర్తి చేయాలన్నారు. ఒకవేళ పాజిటివ్ నమోదైతే హోమ్ ఐసోలేషన్ ఉంచి వారి ఆరోగ్య స్థితి గతులపై పర్యవేక్షించాలన్నారు.

About Author