PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అగ్నిమాపక నిబంధనలు పాటించాలి

1 min read

– జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మాల్యాద్రి
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: ఏలూరు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధికారి మాల్యాద్రి మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా షాపులు నిర్వహించేవారు,బాణసంచా కాల్చే ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.షాపులు నిర్వహించేవారు షాపుకు షాపుకు మధ్య దూరం పాటించాలని అదేవిధంగా లోపలకి బయటికి వచ్చే వేర్వేరు మార్గాలు ఏర్పరచాలని కోరారు,అంతేకాకుండా షాపు నిర్వహణదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,అవసరమైన చోట జిల్లా శాఖ కార్యాలయం నుంచి ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేసే సౌకర్యం ఉంటుందన్నారు, దీపావళి కాల్చే ప్రజలు, విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో ఒక నీళ్ల బకెట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని బానసంచా కాల్చాలని సూచించారు,పండగ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలంతా సురక్షితంగా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా మాపక శాఖ అధికారి మాల్యాద్రి ఏలూరు జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేశారు. (చేయదగినవి) పెద్దవాళ్ల పర్యవేక్షణలోనే టపాకాయలు కాల్చవలెను,టపాకాయలను కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ నీటితో నిండిన బకెట్ను దగ్గర ఉంచుకోవాలను,గాలిలో పేల్చబడే టపాకాయలను విశాలమైన మైదానంలోనే కాల్చవలెను,కొవ్వొత్తిగాని. అగరబత్తిగాని మాత్రమే టపాకాయలను కాల్చుటకు వాడవలెను,టపాకాయలను మీద రాసి ఉన్న జాగ్రత్తలు కచ్చితంగా తప్పనిసరిగా పాటించవలెను,టపాకాయలను చట్టప్రకారం లైసెన్స్ ఉన్న వ్యాపారుల వద్దనే కొనవలెను అని అన్నారు,(చేయకూడద నవి)టపాకాయలను చేతిలో పెట్టుకుని కాల్చకూడదు, టపాకాయలను భూమి మీదనే ఉంచి సురక్షిత ప్రదేశమునకు తరలి వెళ్ళవలెను,పనిచేయని టపాకాయలను వెలిగించడానికి ప్రయత్నించరాదు,ఇంటి లోపల టపాకాయలను కాల్చరాదు. టపాకాయలను మైదానంలోనే కాల్చవలెను,జనసంచారము ఉండే ప్రదేశములలో కాల్చరాదు,టపాకాయలను తయారు చేసే ప్రయోగం చేయరాదు,ఆరిపోయిన టపాకాయలను మరల వెలిగించే ప్రయత్నం చేయరాదు,గాలిలో పేల్చబడే టపాకాయలను విద్యుత్ తీగల వద్ద గాని.డాబా క్రింద గాని. చెట్ల క్రింద గాని ఆకుల కింద గాని ఇంటిలో కాల్చినచో ప్రమాదము జరుగునని దురదృష్టవశాత్తు అగ్రిప్రదాయం జరిగిన వెంటనే101 గాని 08812 230101గాని తెలియజేయాలని సూచించారు.

About Author