రోడ్డు భద్రత నియమాలను పాటించండి… ప్రాణాలను కాపాడుకోండి: ఎస్ఐ
1 min read
ప్యాపిలీ, న్యూస్ నేడు: రోడ్డు భద్రత నియమాల ను పాటించండి ప్రాణాలను కాపాడుకోండి అని ప్యాపిలి ఎస్ఐ మధుసూదన్ అన్నారు . ఈసందర్భంగా శనివారం ప్యాపిలీ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులతో ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహన దారులు ప్రయాణం చేసేటప్పుడు అతివేగంగా వెళ్లకూడదని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే ఆటో డ్రైవర్లు ప్యాసింజర్లును అధిగమించి ఎక్కించుకోకూడదని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.
