PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో నడవాలి

1 min read

– మదరాస విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో అందరూ నడవాలని, అలాగే ఆయన చెప్పిన విధంగా నడుసుకోవాలని, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని, ఇదే ఖురాన్ యొక్క సందేశమని చెన్నూరు మండల మైనార్టీ మత పెద్దలు అన్నారు, మదరాస లలో ఖురాన్ చదివే విద్యార్థులకు రంజాన్ మాసంలో చివరి ఆదివారం లో చేపట్టే ఖురాన్ కాంపిటేషన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈ సందర్భంగా మైనార్టీ మత పెద్దలు మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి, 15సంవత్సరాల ముస్లిం విద్యార్థులకు మదరాసాలలో ప్రతిరోజు ఉదయం1 గంట, అలాగే సాయంత్రం1 గంట ఖురాన్ యొక్క విశిష్టత గురించి మసీదులలో నమాజ్ చదివే గురువులచే పాఠాలు చెప్పడం జరుగుతుందన్నారు, ఇందులో ఖురాన్ చదవడం, రాయడం, అదేవిధంగా అర్థం చేసుకోవడం వంటి వాటిని ముస్లిం విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా వారికి అందులోని మహమ్మద్ ప్రవక్త చెప్పిన విధంగా అర్థం, పరమార్థం, చెప్పడంతో పాటు, సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా ఉండాలి వంటి విషయాలను విద్యార్థులకు బోధించడం జరుగుతుందన్నారు, అలాగే ముఖ్యంగా ముస్లిం మహిళలకు, 15 సంవత్సరాల నుండి ఆపైబడిన వారికి మధ్యాహ్నం 3 గంటల నుండి, 5 గంటల వరకు, అదేవిధంగా 15 సంవత్సరాల నుండి, ఆపై బడిన మగవారికి కూడా ఖురాన్ యొక్క విశేషం గురించి చెప్పడం జరుగుతుందన్నారు, ఇదంతా కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క ఖురాన్ గ్రంథంలో, దేవుని పట్ల ఏ విధంగా నడుచుకోవాలి, మనిషికి మనిషి ఏ విధంగా సహాయ పడాలి, ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి వంటి పవిత్రతను గురించి వివరించడం జరుగుతుందన్నారు, చెన్నూరులో ఐదు మతరాసాలలో దాదాపు 180 మంది విద్యార్థులు ఉన్నారని వారందరికీ కూడా ఈ రంజాన్ మాసం చివరి ఆదివారంలో ఖురాన్ పై కాంపిటేషన్ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేయడం జరుగుతుందని, వారు తెలియజేశారు, అలాగే ఖురాన్ కోర్స్ విద్యార్థులకు మెటీరియల్ తో పాటు, సర్టిఫికెట్ ప్రధానం చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author